మారన్ సోదరుల ఆస్తులు స్వాధీనం

April 02, 2015 | 02:40 PM | 83 Views
ప్రింట్ కామెంట్
maran_brothers_niharonline

వివాదాస్పద ఎయిర్సెల్ - మాక్సిస్ వ్యవహారానికి సంబంధించి డిఎంకె నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు చెందిన  ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం స్వాధీనం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో రెండు మూడు రోజుల పాటు ఇడి ప్రశ్నించిన విషయం విదితమే. రూ.742 కోట్లకు పైగా నిధుల్ని అక్రమంగా తరలించారంటూ మారన్ సోదరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి కేసు నమోదు చేసింది. 2004-07 మధ్య కేంద్ర టెలికం మంత్రిగా పనిచేసిన దయానిధి మారన్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, ఎయిర్‌సెల్‌ను మాక్సిస్ కంపెనీకి అమ్మేందుకు శివశంకరన్‌పై ఒత్తిడి తెచ్చారని, దీంతో 629 కోట్లను సన్ నెట్‌వర్క్‌లో మాక్సిస్ పెట్టుబడులు పెట్టిందని, క్విడ్ ప్రో కో కింద జరిగిన 742 కోట్లలో ఇది భాగమని సిబిఐ విచారణలో బయటపడింది. ఇడి విచారణ అనంతరం ఈ కేసులో 1700 కోట్లకు పైగా లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీచేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ