ఉత్తరభారతంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల మోదీకి ఓ అభిమాని గుడికట్టి పూజలు చేస్తుంటే, మరోకరు ఆయన పేరును ఏకంగా మామిడి పండ్లకు పెట్టిపడేశాడు. లక్నోలోని మలీహాబాద్ శివార్లలో మామిడి పండ్లు పండించే హజీ కలిముల్లా తన తోటలో మోదీ మ్యాంగో పేరుతో మామిడి మొక్కలు నాటాడు. వాటికి పండిన మొదటి మామిడి పండ్లను ప్రధానమంత్రికి రుచిచూపించాలని అనుకుంటున్నాడు. మొదటిగా పండిన మోదీ మ్యాంగో వెరైటీ పండ్లను కేవలం ప్రధాని కోసమే ఉంచాను. కానీ వాటిని ఆయనకు పంపించేందుకు నాకెలాంటి అవకాశం లేదు అని కలిముల్లా చెబుతున్నాడు. ఆ పండ్లను ప్రధానికి పంపాలని తన కోరికని, తప్పకుండా ఆయనకు నచ్చుతాయని అనుకుంటున్నట్లు ఈ పద్మశ్రీ పురస్కార గ్రహీత చెబుతున్నాడు.