ఐపీఎల్-8 వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. మెరుగైనా ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాళ్లకు ఎంతరేటైనా చెల్లించేందుకు ఆయా జట్ల ప్రాంఛైజీలు ఏ మాత్రం వెనకాడటం లేదు. అయితే వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోని ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయి రికార్డు స్రుష్టించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యువీని రూ.16 కోట్లకు కొనుగొలు చేసింది. బెంగుళూరులో సోమవారం ఉదయం ప్రారంభమైన వేలంలో యువరాజ్ ను దక్కించుకునేందుకు జట్లన్నీ పోటీ పడ్డాయి. ఎట్టకేలకు ఢిల్లీ జట్టు రికార్డు ధరకు అతన్ని కొనుగొలు చేసింది. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.