కర్ణాటక లోని హోసురు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రైలుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా అరవైమందికి పైగా గాయాలయినట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థిితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఉదయం 7.45 కి హోసూరు వద్ద పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో దాని వెనుక ఉన్న 9 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ బ్రుందాలు సహాయకచర్యలు ప్రారంభించాయి. ఇక ఘటన గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి సదానంద గౌడ హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. కాగా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సంఘటనా స్థలిని పరిశీలిస్తే తెలుస్తోంది.