ఫేక్ అకౌంట్ తో పడతికి టోకరా... 25 లక్షలతో ఫారిన్ జంప్

June 22, 2015 | 03:05 PM | 5 Views
ప్రింట్ కామెంట్
mumbai_girl_cheated_in_facebook_niharonline

ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ మాయాజాలానికి మరో యువతి మోసపోయింది. ప్రేమించానని నమ్మబలికిన వ్యక్తికి సర్వసంతోపాటు డబ్బు కూడా అప్పజేప్పి సాదరంగా విదేశాలకు పంపింది. తర్వాత మోసపోయాయని తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి మొరపెట్టుకుంది. వివరాల్లోకి వెళ్లితే... అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు పిల్లలున్న అభిషేక్ సింగ్(32) అనే వ్యక్తి ముంబైకి చెందిన ఓ టెక్కీకి(24) ప్రేమ పేరుతో  ఫేస్ బుక్ లో గాలం వేశాడు. నెమ్మదిగా పరిచయం పెంచుకున్న అభిషేక్ తరచూ థానే నుంచి ఆ యువతి కలవడానికి ముంబై వెళ్లేవాడు. చివరికి పెళ్లి చేసుకుంటానని నమ్మబలకటంతో తన మనసుతోపాటు శరీరాన్ని కూడా సమర్పించిందా ఆ యువతి. ఇక ఓ మంచి రోజు తన తల్లికి ఆరోగ్యం బాలేదని, ఆపరేషన్ కి అర్జంటుగా 25 లక్షలు కావాలని ప్రేయసిని కోరాడు. గుడ్డిగా నమ్మిన యువతి డబ్బును ప్రియుడికి అందజేసింది. ఆ తర్వాత వారమైనా అతను పత్తా లేకుండా పోవటం, ఫోన్ స్విచ్ఛాప్ రావటంతో యువతికి అనుమానం మొదలైంది. వెంటనే ఆ యువకుడి ఫేస్ బుక్ అకౌంట్ లోని మిగతా ఫ్రెండ్స్ సహకారంతో చివరికి అడ్రస్ కనిపెట్టింది. థానే లోని అతడి ఇంటికి వెళ్లి చూడగా అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. అభిషేక్ కు అప్పటికే పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసి షాకయ్యింది. వారం క్రితం ఓ బ్యాగ్ తో వచ్చి తనకు సింగపూర్ లో జాబ్ వచ్చిందని తమకు చెప్పి వెళ్లాడని అతడి భార్య యువతికి చెప్పింది. దీంతో మోసపోయాయని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతితోపాటు అతడి భార్య కూడా భర్తపై కేసు పెట్టడం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ