ఎన్డీఏ ఏ టైంలో అధికారంలోకి వచ్చిందో తెలీదుకానీ నిత్యమూ ఎక్కడో ఒక చోట బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మహిళలు బాలికలపై వీరు చేస్తున్న వ్యాఖ్యలు మోదీ తదితర పార్టీ నేతలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సుందర్ లాల్ అమ్మాయిలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఝుంఝునూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సెల్ ఫోన్ వల్ల అమ్మాయిల జీవితాలు పాడైపోతున్నాయని, వారు అనవసరమైన విషయాలు నేర్చుకుంటున్నారని అన్నారు. అంతేకాదు దీనివల్ల జీవితాల మీద చెడు ప్రభావం పడుతోందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలపై విమర్శుల వెలువెత్తుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, సహించేది లేదని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రజాప్రతినిధులు పెడచెవిన పెట్టడం గమనార్హం.