ముఖేష్ డాక్యుమెంటు పై కేసు

March 04, 2015 | 01:41 PM | 62 Views
ప్రింట్ కామెంట్
lesly_woodvin_nirbhayacase_ niharonline

నిర్భయ కేసులో దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూకు సంబంధించిన డాక్యుమెంటరీని నిలిపివేయాలని రాజ్యసభ అన్ని టీవీ ఛానెళ్ళకూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురించ రాదని కూడా సూచించింది. ఈ అంశంపై సభలో జె.డి.యు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా, ఈ డాక్యుమెంటు ఎలా తీసింది దీనికి సంబంధించిన వ్యవహారం సభకు తెలపాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ సూచించారు. దీంతో డాక్యుమెంటరీ కోసం తీహార్ జైల్లో కి ఇంటర్వ్యూ కోసం బ్రిటిష్ సినీ నిర్మాత లెస్లీ ఉడ్విన్ ఎలా వెళ్ళగలిగారని పోలీసులు ఆరా తీస్తున్నారు. అప్పటి యూపీఏ హయాంలోని హోం శాఖ అధికారులు ఆమెకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. తీహార్ జైలు అధికారులు సంజాయిషీ ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా కోరింది. అసలు ఈ డాక్యుమెంటరీలో కంటెంట్ తెలుసుకునే ప్రయత్నం కూడా జైలు అధికారులుగానీ, హోంశాఖ గానీ చేయలేదని తెలుస్తోంది. ముఖేష్ ఇంటర్వ్యూకు సంబంధించి ముడి ఫుటేజీ తనవద్ద ఉందని లెస్లీ ఉడ్విన్ గత ఏడాది ఫిబ్రవరిలోనే హోం శాఖకు తెలిపినప్పటికీ దాన్ని పరిశీలించలేదంటున్నారు. ఆ ఇంటర్వ్యూను రికార్డు చేసినప్పుడు జైలు డీజీగా విమలా మెహ్రా ఉన్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఫుటేజీని బీబీసీకి ఇచ్చే హక్కులు తనకు ఉన్నాయని లెస్లీ అంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ