ఏంటీ? బయటికి రాకూడదా... ఇది టూమచ్ రాజా

January 23, 2015 | 04:27 PM | 78 Views
ప్రింట్ కామెంట్

రాజు తలుచుకుంటే దెబ్బలకు కోదువా అన్నట్లు తయారయ్యింది ఒబామా పర్యటన. ఆయన పర్యటనేమో గానీ... ఛోటా నాయకులు వస్తేనే రోడ్లను శుభ్రపరిచి బ్లీచ్ చల్లే అధికారులు... మరీ ఇప్పడు ఒబామా కాలికి దుమ్ముకూడా అంటోద్దని ఫిక్సయ్యారేమో, దగ్గరుండి మరీ ఆగ్రాను అద్దంలా తయారుచేశారు. సుమారు 600 మంది దినసరి కూలీలతో ఒబామా పర్యటించే రోడ్లను బ్రష్, సర్ఫ్ నీటితో శుభ్రం చేస్తున్నారు. అలాగే ఆయన పర్యటన రోజున ఆవులు, గేదేలు, వీధి కుక్కలు కనపడకూడదని ఆదేశాలు జారీ చేశారు. తాజ్ మహల్ ను ఆనుకుని ఉండే యమునా నదిలో పేరుకుపోయిన రెండు టన్నుల చెత్తను రెండు రోజుల్లో తీయించేశారు. తాజ్ లోపలి భాగాలు , లాన్ ను మహిళలు శుభ్రం చేస్తుండగా, బయట పురుషులు పనిచేస్తున్నారు. అంతేకాదు తాజ్ చుట్టుపక్కల ఉండేవారు ఆరోజు బయటకు రాకూడదట, చివరికి డాబామీదికి కూడా వెళ్లకూడదట. సగటు ప్రజల బాధలను పట్టించుకోని ఈ ప్రభుత్వం ఓ విదేశీ అధ్యక్షుడికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. యాభై ఏళ్ల క్రితం అదే అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఓపెన్ టాప్ కారులో తాజ్ పర్యటన చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి లార్మ్ దా అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయన ప్రయాణిస్తున్న వాహనం బురదలో చిక్కుకుంది. అప్పటి ప్రధాని నెహ్రూతో కలిసి ఆయన బురదలోనే గ్రామమంతా పర్యటించారు. కానీ ఇప్పడేమో ఇలా.. కాలంతోపాటు మనుషులు మారారు. బహుశా అతిథి దేవోభవ అన్న సూత్రాన్ని కాస్త అతిగా ఫాలో అవుతుందేమో ఈ ప్రభుత్వం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ