సాంకేతిక పరిజ్ణానం పీక్ స్టేజ్ లో ఉన్న ఈరోజుల్లో కూడా బాబాలు లేని మందిరం, వాళ్లు లేని ఊర్లు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే మన దేశంలో సైంటిస్టుల కన్నా బాబాలే ఫేమస్ అని జులాయిలో అల్లు అర్జున్ చెబుతాడు. అది అంతా ఒప్పుకుని తీరాల్సిందే. వాళ్ల మోసాలు బయటపడుతున్న, బోగసులు అని తేలినా భక్తుల పిచ్చి మాత్రం పరాకాష్టలోనే ఉంటుంది. రాధే మా వ్యవహారం రీసెంట్ గా బయటపడగా, ఫ్రెష్ గా మరో బాబా వ్యవహారం బయటికిపొక్కింది. ఓ ఒడిషా బాబా గారి బండారం హైదరాబాద్ లో బయటపడి పెద్ద సంచలనం గా మారింది. ఆయన అలాంటి ఇలాంటోడు కాదు... సెక్స్ పరమైన నేరాలకు పాల్పడి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. వివాదాస్పద ఒడిషా సారథి బాబాను భువనేశ్వర్ లో ఒడిషా క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సారథి బాబా అలియాస్ సంతోష్ రౌల్ మహిళలతో శృంగార కార్యకలాపాలు, మోసం, ఫోర్జరీకి పాల్పడినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఓ మహిళతో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సాగించిన రాసలీలలను ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. దీంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ షరా మాములుగా సారధి ఆ ఆరోపణలను ఖండించారు. టీవి ఛానెల్ పై కేసు పెడతానని బాబా హెచ్చరించారు. అయితే ఖాకీలు మాత్రం కషాయాన్ని వదలలేదు. ఐపీసీ 420 కింద, క్రిమినల్ కుట్ర, ఆయుధాల చట్టం 341, ఎస్ ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టారు. ఆశ్రమాన్ని తనిఖీ చేసి , కొన్ని బంగారునగలు, నగదు, వెండి, ఇతర నాణేలు ఫోటోలు, బ్యాంక్ అకౌంట్లను పరిశీలించారు. ముఖ్యపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 14 గంటలపాటు హైడ్రామా అనంతరం పోలీసులు వివాదాస్పద సారథి బాబాను అరెస్ట్ చేసి, కటక్ లోని క్రైంబ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ కు తీసుకువచ్చారు. శనివారంనాటి మధ్యాహ్నం ఆయనను అరెస్ట్ చేసినట్లు క్రైంబ్రాంచ్ ఏడీజీ బికె శర్మ తెలిపినా... అధికారంగా ప్రకటించేందుకు ఆదివారం సాయంత్రం దాకా వేచి చూశారు. ఎందుకంటే జనాల్లో ఆయన క్రేజ్ అలా తగలడింది మరి. సదరు టీవీ చానెల్ ప్రసారం చేసిన వీడియోలు ఈ కొత్త దేవుడు జీన్స్, టీషర్టులు ధరించి సరికొత్త అవతారంలో మూడురోజులపాటు ఆ హోటల్‌లో గడిపాడు. ఏకాంత సేవ చేసిన ఆ మహిళను రిసెప్షన్ లో భార్యగా పేర్కొన్నాడని తెలిసింది. ఇలాంటి వాడికి రాజకీయ నేతల మద్దతు... నిజంగా శోచనీయం.