బామ్మకు ఇసుకే అన్నం....

May 15, 2015 | 01:35 PM | 28 Views
ప్రింట్ కామెంట్
old_lady_eating_sand_niharonline

‘మేం రాళ్ళు తిని హరాయించుకున్నాం(అరిగించుకున్నాం)’ అంటుంటారు పెద్ద వాళ్ళు చమత్కారంగా. అంటే అప్పట్లో మేం ఏవేవో తినేసి అరిగించుకుని ఉక్కు మనుషుల్లా ఉన్నామని వారి ఉద్దేశం. మరి ఈ ముసలమ్మేంటో రోజూ ఒక కిలో ఇసుక తినేస్తుందట.  అది కూడా  అన్నంలాగా, అదొక ఆహారంలాగా... విచిత్రంగా అనిపిస్తుంది కదా...? నిజంగానే రాళ్ళు తిని అరిగించుకుంటున్నట్టే కదా ఈవిడ. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్ జిల్లా కజిర్ నూర్ పూర్ గ్రామానికి చెందిన సుధామ దేవి కి ఇప్పుడు 92 ఏళ్లు. రోజుకు నాలుగు ప్లేట్లు ఇసుకను అవలీలగా తిని అరిగించుకుంటుందట. కేవలం ఇసుక తిని బతుకుతోంది. అందులో ప్రొటీన్లు, మినరల్స్, చక్కెరలు ఏం ఉంటాయని ఈ ముసలమ్మ ఇలా రాయిలా ఉంది? ఇక ఈ బామ్మకి ఏ రోగాలూ లేవట కూడా.  చిన్నప్పుడు ఏదో షరతు కోసం తినడం ప్రారంభించిన ఈవిడ, ఇప్పటికీ అదే అలవాటును కొనసాగిస్తోంది. పెళ్లికి ముందు తండ్రి, తరువాత భర్త ఈ ఇసుక తిండి అలవాటును పెద్దగా పట్టుంచుకోలేదట. బామ్మకి మొత్తం పదిమంది సంతానం. కానీ ఈమె సంతానానికి  ఈవిడ అలవాటు రాలేదండోయ్... 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ