విమానంలో వేధింపులు... వీడియోతో బుద్ధిచెప్పిన యువతి

February 03, 2015 | 05:15 PM | 34 Views
ప్రింట్ కామెంట్

ఆకతాయిలు అమ్మాయిలు భూమ్మీదే కాదు ఆకాశంలోనూ వదలమంటున్నారు. తాజాగా ఇండిగో విమానంలో వయసు మీరిన ఓ ఈవ్ టీజర్ ఓ యువతిని వేధించటం మొదలుపెట్టాడు. దాంతో యువతి ఆ తతంగమంతా వీడియో తీసి పోలీసులకు పట్టించి 60 ఏళ్ల ఆ పెద్దాయనకు బుద్ధిచెప్పింది. జార్ఖండ్ కు చెందిన ఓ యువతి భువనేశ్వర్ కు వెళ్తుండగా వెనుక సీటులో ఆ ముసలాయన అసభ్యంగా ప్రవర్తించటం ప్రారంభించాడు. సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి యువతిని తాకేందుకు ప్రయత్నించాడు. ఎంతవారించినా పదేపదే అలాగే చేస్తుండంతో యువతి ఓ ఆలోచన చేసింది. మెల్లిగా ఆ యువతి అతని ఫోటోతోపాటు, ఆ చర్యలను వీడియో తీసింది. తర్వాత ఒక్కసారిగా కేకలు వేసి విమాన సిబ్బందికి జరిగిందంతా చెప్పింది. దీంతో వారు అతన్ని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పజేప్పారు. కాగా, సదరు పెద్దాయన పలు కంపెనీలకు సీఈవో అట. దీంతో వారు ఆయన్ను కాసేపటికే వదిలేశారు. కాగా, యువతి చర్యకు గర్విస్తున్నట్లు ఆమె తండ్రి తెలిపాడు. ఆమె చాలా దైర్యవంతురాలని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ