బీజేపీ నేత, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి రాంపూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2009లో ఎన్నికల సమయంలో కోడ్ ను ఉల్లంఘించినట్లు నఖ్వీపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను రాంపూర్ సమీపంలో అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఈ కేసులో రాంపూర్ కోర్టు నఖ్వీకి ఏడాది జైలుశిక్ష విధించింది. అయితే ఆ వెంటనే షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరుచేసింది.