మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా కొలువుదీరిన ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇంకా ఎంతోకాలం కొనసాగదని ఆయన వ్యాఖ్యానించారు. రాయ్ గఢ్ జిల్లాలోని అలీబాగ్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో మళ్లీ ఎన్నికల నిర్వహాణ వద్దనే ఉద్దేశ్యంతోనే ఎన్సీపీ బీజేపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్ధతు ప్రకటించింది. అయితే ఇప్పుడీ తాజా వ్యాఖ్యలతో మహా రాజకీయాలలో గందరగోళం నెలకొంది. ఎన్సీపీని నమ్మలేని ఈ పరిస్థితిలో పాత మిత్రపక్షం, ప్రతిపక్షం శివసేనతో తిరిగి జత కట్టేందుకు బీజేపీ ప్రయత్నించడం చాలా సేఫ్.