అక్రమంగా మత్తు పదార్థాలను తరలిస్తున్న విమానం గాల్లో వుండగానే పైలట్ దాంట్లోంచి కిందకి దూకేశాడు. ఆ తర్వాత ఆ విమానం కూడా కొలంబియాలో కుప్పకూలింది. ఇంతకీ జరిగిందేమిటంటే... వెనెజులా దేశానికి చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం టన్నుకు పైగా కొకైన్‑తో కొలంబియాకి బయల్దేరింది. అయితే ఆ విమానాన్ని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన పైలట్ విమానంలోంచి కిందకి దూకేశాడు. ఆ తర్వాత ఆ విమానం కొలంబియా తీరంలో కూలిపోయింది. విమానంలోంచి దూకేసిన పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకొంది.