పోలీసుల ప్లాన్ ఫ్లాప్... యువతిపై రెండోసారి రేప్

July 11, 2015 | 05:27 PM | 6 Views
ప్రింట్ కామెంట్
maharastra_julna_rape_case_niharonline

నిందితులను పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు చేసిన ఫ్లాన్ ఫెయిల్ అవ్వగా మరోసారి ఘోరం జరిగేందుకు అవకాశం కల్పించినట్లయ్యింది. జాల్నా ప్రాంత పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 7 న ఒంటరిగా ఉన్న ఓ 19 ఏళ్ల యువతిని కత్తులతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ యువతి మొబైల్ నే లాక్కుని ఆ దారుణాన్ని రికార్డు చేశారు. ఆ మొబైల్ కావాలంటే డబ్బు ఇవ్వాల్సిందిగా బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. దీంతో ఆ యువతి పోలీస్ లను ఆశ్రయించింది. ఇక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ పన్నారు. బాధితురాలితో ఫోన్ చేయించి డబ్బు ఇస్తానని చెప్పి ఓ ప్రదేశానికి రావాల్సిందిగా కోరారు. అయితే, అక్కడికి వెళ్తున్న యువతిని మార్గమధ్యలోని పట్టుకుని మరోసారి నిందితులు అత్యాచారం చేశారు. దీంతో సీరియస్ అయిన పోలీస్ యంత్రాగం ఆ నిందితులను వెంటనే అరెస్ట్ చేసింది. పిచ్చిప్లాన్ వేసిన ఎస్సైని ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇక జనాలేమో అనుకున్నదోక్కటి, అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిరో బుల్ బుల్ పిట్ట అని పాటలు పాడుకుంటున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ