దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి లభించిన అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. అది కూడా హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే వారణాసిలోనైతే ఇక అస్సలు చెప్పనక్కర్లేదు. భగవదనుగ్రహం కోసం అక్కడ ఏపనైనా సంతోషంగా చేస్తారు. ప్రతి ఏడాది చైత్ర నవరాత్రుల సందర్భంగా ఏడవ రాత్రి మణికర్ణిక ఘాట్ లోని మహాశ్మశాన్ నాథ్ ఆలయంలో సెక్స్ వర్కర్లందరూ పెద్ద ఎత్తున గుమిగూడతారు. అనంతరం అక్కడి చితి మంటల వెలుగులో వారందరూ నర్తిస్తారు. ఆ స్రుష్టి లయకారుడి శాంతి కోసం ఆనంద తాండవం చేస్తారు. తాజాగా , ఈ క్రతువులో పాల్గొన్న సెక్స్ వర్కర్లు బాలీవుడ్ హిట్ గీతాలకు డ్యాన్సులు చేశారు. దీని గురించి వార్షిక నాట్య క్రతువు నిర్వాహకుడు గుల్షన్ కపూర్ మాట్లాడుతూ... కాశీలో చావు అన్నది చింతించాల్సిన విషయం కాదని చాటడమే ఈ వేడుక నిర్వహించటం వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు. కాగా, ఈ క్రతువులో భాగంగా, తొలుత 8 గంటల ప్రాంతంలో మందిరం లోపల డ్యాన్సు చేస్తారు. అది దేవుడి కోసం! అనంతరం స్థానికులు, విదేశీ యాత్రికులు ఆ సెక్స్ వర్కర్లతో జత కలుస్తారు. అర్థరాత్రి వరకు ఈ ఉత్సవ హేల కొనసాగుతూనే ఉంటుంది.