దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం హఠాన్మరణం గురించి తెలిసిందే. ప్రజల మనిషి కాబట్టే ఈరోజు దేశమంతా కలాం గురించి, ఆయన ఖ్యాతి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఓ ముస్లిం పేద కుటుంబంలో జైనుల్ అబిదీన్-హాజీ అమ్మాల్ దంపతులకు జన్మించాడు కలాం. పడవ యజమాని అయిన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కష్టపడేతత్వాన్ని ఆయన నుంచే అలవాటు చేసుకున్నాడు. అలాంటి ఆయన గురించి కొన్ని ఆసక్తికర అంశాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అబ్దుల్ కలాం ని చూడగానే ముందుగా దృష్టి ఆయన హెయిర్ స్టైల్ పైకి వెళ్లుతుంది. అంతేకాదు ఆయనకు జట్టు అంటే ప్రాణం. అందుకే ఎంత పెద్ద మీటింగ్ లు అవుతున్నా కూడా చేతుల్తోనో లేక దువ్వెనతోనే దువ్వుకుంటు ఉంటారు. ఆయన పూర్వీకులంతా కాస్త పొడవాటి జుట్టును పెంచుకునేవారు, దీంతో కలాం కూడా అదే ట్రెండ్ ను కొనసాగించారు. ఇక ఢిల్లీలోని హబీబ్ ఫ్యామిలీ మెంబర్స్ నిర్వహించే సెలూన్ లోనే ఈయన హెయర్ క్రాప్ చేయించుకునేవారంట. అందుకోసం కలాం వారికి రూ.500 చెల్లించేవారట. కలాం పక్కా శాకాహారి. మద్యపాన వ్యతిరేకి. ఇక ఆయన అభిమానులను వేధించే మరో ప్రశ్న ఆయన ఎందుకు బ్రహ్మచర్యం పాటించారని. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. అందుకే ఆయన అమ్మ హాజీ అమ్మాల్ చాలా ఒత్తిడి తెచ్చారట, కానీ, పెళ్లి చేసుకునేందుకు కలాం ఒప్పుకోలేదంట. దీనికి కారణం తెలిస్తే ఆశ్చర్యంకలగక మానదు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన ఓ సిద్ధాంతాన్ని పెట్టుకుని దాన్నే పాటిస్తూ వచ్చారట. అంతేకాదు మతాలకతీతంగా ఖురాన్ తో బాటు, భగవద్గీత ను కూడా చదివేవారు. అద్భుతాలు చెయ్యాలంటే బ్రహ్మచారిగానే సాధ్యపడుతుందన్న పాలసీని కలాం కూడా గట్టిగా నమ్మటమే కాదు ఆచరించి చూపారు కూడా కలాం. అందుకే ఆయన చెప్పే కొటేషన్లు కూడా అంత గొప్పగా ఉంటాయి.