రోహ్తక్ సిస్టర్స్. బస్సులో తమను వేధిస్తున్న ఆకతాయిలను పిచ్చి కొట్టుడు కొట్టి వార్తల్లోకెక్కారు. తమను కాపాడేందుకు తోటి ప్రయాణికులెవరు ముందుకు రాకున్న ధైర్యం చేసి వారిని ప్రతిఘటించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఇక హర్యానా ప్రభుత్వం అయితే ఏకంగా వారికి రాష్ట్రపతి చేత సన్మానం చేయించాలని యోచిస్తోందట. అయితే ఈ అక్కా చెల్లెల గురించి ఇప్పడో ఇంట్రస్టింగ్ విషయం తెలిసింది. ఇలా తమను వేధించే ఆకతాయిలను ఉతికే కార్యక్రమం వీరు గతంలోనే ఒకసారి చేశారట. రోహతక్ పార్క్ సమీపంలో ఉన్న వీరిని టీజ్ చేస్తున్న కుర్రాళ్లను వీరు తెగ దంచారట. ఆ ద్రుశ్యాన్నంతా ఎవరో వ్యక్తి ఫోన్లో బంధించాడు. అయితే బస్సు ఉతుకుడు గురించి వార్తలు రావడంతో సదరు ఆ వ్యక్తి ఆ పాత వీడియోను సోషల్ సైట్లో అప్ లోడ్ చేసేశాడు. అమ్మాయిలు... ఎవడైనా టీజ్ చేస్తే భయపడిపోకుండా ఈ అక్కా చెల్లెల దంచుడు చూసైనా ఇన్ స్పిరేషన్ కండమ్మా!