రెండో ప్రపంచయుద్ధ కాలంలో అమెరికా తరఫు గూఢచారిగా భారత్‌లో పనిచేసిన వనిత ఎలజబెత్ బెట్టీ మాకింతోష్. తప్పుడు వార్తాలను జపాన్ సైనికులకు చేరవేసి వారిని తప్పుదోవ పట్టించిన ఎలిజబెత్ బెట్టీ మంగళవారం వందవ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆమె అమెరికాకు విశేష సేవలు అందించినందుకు గాను బెట్టీ వందవ పుట్టిన రోజును సీఐఏ ప్రధానకార్యాలయంలో ఘనంగా జరిపారు జర్నలిస్టు అయిన బెట్టీ 1943 నుంచి కొన్నేళ్ళ పాటు భారత్‌లోనే ఉన్నారు. ఇంఫాల్ వద్ద జరిగిన పోరులో జపాన్ సేనలు వెనక్కి వెళ్లేందుకు ఆమె అతస్య వార్తలే కారణమంటూ మేధావులు భావిస్తారు. బెట్టీ సీఐఏలో భాగస్వామి కావడం మాకెంతో గర్వకారణం అని సీఐఏ ఉన్నతాధికారి బ్రెనాన్ పేర్కొన్నారు.