చిట్టి పొట్టి దుస్తులతో, బాలీవుడ్ పాటలకు స్టెప్పులతో వివాదాలు చుట్టుకునేలా చేసుకున్న ఆధ్యాత్మిక గురువు రాధేమా. ఇప్పటికే పలు కేసులతో ఆమె సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఆమె వైఖరిని తప్పు పట్టేవారు ఎంతమందో.. ఆమెగారిని వెనకేసుకొస్తున్న వారు కూడా అంతే. వారి వారి వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాధేమాను సమర్ధిస్తూ.. బాలీవుడ్ ప్రముఖ గాయకుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటమే కాదు.. పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ రూపంలో చేసిన సోనూనిగమ్.. రాధేమా ధరించిన కురచ దస్తుల కన్నా.. బొమ్మల్లో కాళికా మాత ధరించే దుస్తులు మరింత పొట్టిగా ఉంటాయి కదా? అంటూ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ట్వీట్ చేశారు. ఓ మహిళ ధరించిన దుస్తుల గురించి మాట్లాడుకోవటం విడ్డూరమన్న ఆయన.. మగ సాధువులు నగ్నంగా తిరుగుతూ.. నృత్యాలు చేస్తే పట్టించుకోరని.. కానీ.. రాధామా లాంటి వారి మీద మాత్రం విమర్శలు చేస్తామని చెప్పిన ఆయన.. అలా వ్యాఖ్యలు చేసే వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
తాజాగా సోనూనిగమ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాధేమాను.. కాళికా అమ్మవారిని పోల్చటం.. వారి దుస్తులపై సోనూనిగమ్ వ్యాఖ్యలు చేసి పెద్ద తప్పు చేశాడన్న వాదన వినిపిస్తోంది. మరి.. దీనిపై సోనూనిగమ్ చెంపలేసుకుంటారో లేదంటే కోట్లాదిమంది మనోభావాలు దెబ్బ తీస్తూ మరిన్ని వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. ఇంకేదరు ఇంకెన్నీ వ్యాఖ్యలు చేస్తారో?