వ్యవసనాల బారిన పడిన విద్యార్థిని వద్దని మందలించినందుకు ఆ మాష్టారు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే... మేఘాలయా రాజధాని ఇంఫాల్ లోని జవహార్ నవోదయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ ఆవరణలోనే మద్యం సేవించాడు. దానిని చూసిన ఉపాధ్యాయుడు అలెక్స్ పమ్మి ఆ విద్యార్థిని మందలించాడు. సాధారణంగానే అది ఆ విద్యార్థికి కోపం తెప్పించింది. దాంతో కత్తితో మాష్టార్ పై దాడిచేశాడు. ఐదు కత్తిపోట్లు తిన్న పమ్మిని ఆస్పత్రిలో చేర్చగా, ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఆ విద్యార్థి పరారీలో ఉన్నాడు. విద్యార్థి ని సక్రమ మార్గంలో నడిపించాలనుకున్న ఆ మాష్టార్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడట.