సోషల్ మీడియా అతికి అడ్డుకట్టపడాల్సిందే!

August 07, 2015 | 02:41 PM | 1 Views
ప్రింట్ కామెంట్
indian_supremecourt_on_social_media_regularation_niharonline

సీనియర్ న్యాయవాది ఎల్.నాగేశ్వర రావు సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అది ఆయనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి. ఓ రేప్ కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొంటూ ఈ మధ్య వాట్సా యాప్ లో సందేశం చక్కర్లు కొట్టిందట. దీంతో ఆయనకు తల కొట్టేసినట్లు అయిందని సదరు బెంచ్ ముందు ఆయనగారు మొరపెట్టుకున్నారు. ఆయనే కాదు మరో న్యాయవాది పరాశరన్ సైతం ఇదే వాదనను వినిపించారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త పేరు ఉన్నవారు ఎదుర్కుంటున్న సమస్య ఇదే. వాళ్లే కాదు మాములు జనాలు కూడా ఈ పైత్యానికి బలైపోతున్నారు. అభ్యంతరకర సందేశాలతోపాటు, ప్రజలను అయోమయానికి గురిచేసే వదంతులు ఈ సోషల్ మీడియా ద్వారానే త్వరగా, అధికంగా వ్యాపిస్తున్నాయని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయం వెలుబుచ్చింది. వాటిని నియంత్రించి, ఇంటర్నెట్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది. వివాదాస్పద సెక్షన్ 66ఏ ను రద్దు చేసిన తర్వాత ఈ పరిస్థితి ఎక్కువైందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రపుల్ల సి పంత్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు ఎల్ నాగేశ్వరరావు, పరాశరన్ ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, సోషల్ మీడియా అతికి అడ్డుకట్ట పడాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారస్సులు పంపుతామని తెలిపింది.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ