పెద్దాయన పేరు పీతలకు పెట్టాడు

February 27, 2016 | 05:45 PM | 2 Views
ప్రింట్ కామెంట్
tejas--thackeray-find-crab-named-thackrey-niharonline

మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం థాక్రే.  'శివసేన' వ్యవస్థాపకుడు బాల్ థాక్రే నుంచి ఆ పేరు బాగా పాప్యులర్ అయింది. ఆయన అనంతరం కూడా శక్తిమంతమైన థాక్రేల కుటుంబం తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతుంటుంది. తాజాగా ఆ పేరును జంతువులంటే ఇష్టపడే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు తేజస్ థాక్రే(19) ఓ జాతి 'పీత'కు పెట్టాడు!. తాత పేరు పీతకు ఎందుకు పెట్టాడంటారా? దానికి ఓ కారణం ఉంది.

                               ఉద్ధవ్ చిన్న కుమారుడికి అడవులన్నా, అక్కడి జీవజాలాలన్నా బాగా ఇష్టం. గతేడాది కొంతమంది స్నేహితుల బృందంతో కలసి కొంకణ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి రఘువీర్ ఘాట్స్ సమీపంలో ఐదు కొత్త జాతులకు చెందిన మంచినీటి పీతలు కనిపించాయి. అప్పుడే వాటికి థాక్రే పేరు పెట్టాడు.

అంతటితో ఆగలేదు పీతల జాతి వివరాలను తెలుపుతూ అంతర్జాతీయ సైన్స్ పత్రికలకు పంపాడు. వాటికి సంబంధించిన పరిశోధన పత్రం కూడా జుటాక్సా అనే పత్రికలో ప్రచురితమవడంతో ఈ పీతల పేరు ప్రపంచవ్యాప్తమైంది. దాని పూర్తిపేరు 'గుబెర్ నాటోరియానీ ఠాకరాయి'. సింధ్ దుర్గ్ జిల్లాలోని సావంత్ వాడి పట్టణంలో అవి ఎక్కువగా ఉంటాయి. అలా తాతపై ప్రేమతో పీతలకు పేరు పెట్టకున్నాడు మనవడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ