మహానగరం నడిబొడ్డులో సొరంగం... కలకలం

September 19, 2015 | 02:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
kolkata-tunnel-found-in-road-middle-niharonline

స్మగర్లల దారి ఎప్పుడూ అడ్డదారే అన్నది మళ్లీ రుజువైంది. హాలీవుడ్ సినిమాల ఇన్సిపిరేషన్ తో కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా మహానగరం నడిబొడ్డున ఓ సొరంగం బయటపడడం కలకలం రేపింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఆ సొరంగాన్ని చూసి పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు. ఈ సంఘటన కోల్‌కతా నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అత్యంత రద్దీగా ఉండే రెడ్‌ రోడ్‌ ప్రాంతంలో ఓ గుంతను గమనించారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యచకితులయ్యారు. అది గుంత కాదు.. సొరంగమని గుర్తించారు. ఆరు ఫీట్ల లోతు, మూడు ఫీట్ల వెడల్పు గల దీనిగుండా స్మగ్లర్లు తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సొరంగం లోపల స్టీల్‌ కాపర్‌ వైర్లు, స్టీల్‌ ప్లేట్లు పడివున్నాయని, దీనిగుండా పెద్ద ఎత్తున డబ్బు బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని, ఇప్పటివరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని జాయింట్‌ కమిషనర్‌ రాజీవ్‌ మిశ్రా తెలిపారు. డిసెంబర్‌ 2013లో ఇలాంటి సొరంగాన్ని తవ్విన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే వారికి, రెడ్‌ రోడ్‌లో సొరంగాన్ని తవ్విన దుండగులకు సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ