ట్విట్టర్ ఖాతాలోకి జిప్ డయల్

January 20, 2015 | 03:52 PM | 33 Views
ప్రింట్ కామెంట్

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ భారత మొబైల్ మార్కెటింగ్ సంస్థ జిప్ డయల్ ను కొనుగొలు చేసింది. దాదాపు 30 నుంచి 40 మిలియన్ డాలర్ల దాకా బేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జిప్ డయల్ సొంత వెబ్ సైట్ లో, ట్విట్టర్ ఖాతాలో స్వయంగా తెలిపింది. అటు ట్విట్టర్ ఇండియా కూడా తన ఖాతాలో ఈ ఒప్పందం గురించి ట్వీట్ చేసింది. ప్రజలకు మరింత చేరువయ్యేందకే ఈ ఒప్పందం చేసుకున్నామని ట్విట్టర్ తెలిపింది. బెంగుళూర్ కు చెందిన జిప్ డయల్ మిస్డ్ కాల్ కు చెందిన సర్వీస్. మేసేజ్ రూపంలో అది సమాచారాన్ని అందజేస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ