అక్కడ సల్మాన్ పై జోకులే జోకులు

December 11, 2015 | 04:04 PM | 2 Views
ప్రింట్ కామెంట్
salman-khan-invented-1st-driverless-car-niharonline

మన చట్టానికి కళ్లు లేవని మరోసారి స్పష్టమైన ఘటన ఇది. ఎదురుగా అని రుజువులు ఉన్నా ఏం చేయలేని పరిస్థితి.  దాదాపు 13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ముంబైలో ఓ కారు అతి వేగంగా వస్తూ, ఫుట్ పాత్ పైకి ఎక్కి ఓ మనిషి ప్రాణాన్ని హరించింది. ఆ కారులో ఉంది అప్పుడప్పుడే బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సల్మాన్ ఖాన్. అంతవరకూ పచ్చినిజం. కట్ చేస్తే ప్రాణం పోయిన మాట నిజం, సల్మాన్ కారులో ఉన్నది నిజం. కానీ సల్మాన్ నిరపరాధి. కారును నడిపింది అతనేనని చెప్పేందుకు సాక్ష్యం లేదు. దీంతో న్యాయస్థానాలు నిర్దోషిగా ప్రకటించాయి.

ఇక ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతూనే ఉన్నాయి. ఇంత సీరియస్ కేసులో జోకులేంటంటరా? మరదే మన నెటిజన్ల పనితనం. కొంతకాలంగా డ్రైవర్ లేని కారును తయారు చేస్తున్న గూగుల్ ఆ దిశగా విజయం సాధించినట్టు ఇటీవలే ప్రకటించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఆ కారును ప్రపంచానికి పరిచయం చేసింది కూడా. సిలికాన్ వ్యాలీలో ఆ కారు నిదానంగా వెళుతున్నందుకు కాలిఫోర్నియా పోలీసులు జరిమానా కూడా విధించబోయారన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మన నెటిజన్ల చర్చ ఏంటంటే "గూగుల్ ఇప్పుడు డ్రైవర్ లేని కారును కనుగొంది. కానీ, మన సల్మాన్ 13 ఏళ్ల క్రితమే డ్రైవర్ లేని కారును కనుగొన్నాడు" అంటూ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో సల్మాన్ పై వచ్చిన కామెంట్లలో అత్యధికం ఇటువంటివే.

"మా సల్మాన్ భాయ్ 2002లోనే డ్రైవర్ లెస్ కాన్ ను కనుగొన్నాడు... గూగుల్ జాగ్రత్త" అని ఒకరంటే, "సల్మాన్ నడపలేదు, అతని డ్రైవర్ నడలపేదు. బహుశా ఆటోపైలట్ వ్యవస్థను సల్మాన్ కనిపెట్టాడు" అని మరొకరు, "కాబట్టి, ఇండియాలో డ్రైవర్ రహిత కారు 2002లోనే కనుగొన్నాం. గూగుల్ ఇక క్రెడిట్ మీది కాదు" అని మరొకరు... ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే విషయమై వేల ట్వీట్లు వచ్చాయి, వస్తున్నాయి. కృష్ణ జింక కేసులో కూడా సల్లూ బాయ్ పై జోకులు పేలుతూనే ఉన్నాయి. తనను ఎవరూ చంపలేదని, సల్మాన్ నిర్దోషి అని, తానే ఆత్మహత్య చేసుకున్నానని కృష్ణ జింక పక్కన సూసైడ్ నోట్ దొరికిందట... ఇలా కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ