పుట్టిన రోజు శుభాకాంక్షలు బామ్మగారూ....

March 05, 2015 | 12:57 PM | 33 Views
ప్రింట్ కామెంట్
Misao_Okawa_with_family_niharonline

జపాన్ కు చెందిన మిసావో ఒకావా అనే ఈ బామ్మగారి వయసు 117 సంవత్సరాలట. ఆవిడ ఈ రోజున తన కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ బామ్మగారు ఇప్పుడు ప్రపంచ వృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇన్నేళ్ళు జీవించి ఉండడంలో గల రహస్యమేమిటని ఆమెను అడిగితే. ‘నాకు కూడా ఇది అద్భుతంగానే అనిపిస్తుంది’ అని నవ్వేసిందట. ఈవిడ మార్చి, 5 1898లో టెన్మాలో పుట్టింది. గతంలో ఈవిడ ఆరోగ్యంగా జీవించడానికి గల కారణం సమయానికి భోజనం చేయడం, 8 గంటలు నిద్రపోవడం అని చెప్పింది. ఈవిడ పుట్టిన రోజును ఓ ప్రత్యేక మైన రోజుగా జపాన్ టెలివిజన్ లో ప్రసారం చేశారట. ప్రభుత్వం నుంచి ఈవిడకు పెద్ద బొకేను కూడా అందజేశారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ