తామే తల్లిదండ్రుల మంటూ ఒకే బాలుని కోసం ఇరు దంపతుల జంట పోటీ పడుతున్నారు. వైఎస్‌ఆర్ జిల్లా వీరబల్లికి చెందిన ఈశ్వరయ్య, ప్రభావతి దంపతులకు పిల్లలు లేరు. గత ఆదివారం వైద్య పరీక్షలకు తిరుపతి వెళ్లి వెంట ఓ బాలుడ్ని తెచ్చుకున్నారు. బాలుడి విషయం ఊర్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలుడ్ని స్వాధీనం చేసుకుని కడప ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పారు. ఇదిలా ఉండగా ఆ బాలుడు తమ అబ్బాయేనంటూ హైదరాబాద్‌కు చెందిన వడ్డె వెంకటయ్య, మణెమ్మ దంపతులు పోలీసుల వద్దకు వెళ్ళారు. మా అబ్బాయి గత జనవరి 5 నుంచి కనిపించడం లేదంటూ వివరించారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. తమ బాలుడే నంటూ తిరుపతి నుంచి లక్ష్మి, చందు దంపతులు ఆ పిల్లాడు తమ కొడుకు దీపక్ అని చెబుతూ అధికారులను కలిసిశారు. తాము వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్ళామనీ, ఒక వృద్ధుడి వద్ద పిల్లాడిని వదిలి లోపలికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పిల్లాడు కనిపించ లేదన్నారు. ఇక పోలీసులు అనిన విధాల దర్యాప్తు చేసి అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి అసలైన తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఐసీడీఎస్ పీడీ రాఘవరావు తెలిపారు.