పాపం ప్లాస్టిక్ పసిపాప

May 11, 2015 | 01:53 PM | 36 Views
ప్రింట్ కామెంట్
woman_gives_birth_to_plastic_baby_punjab_niharonline

పంజాబ్ లోని  అమృతసర్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఓ మహిళ ప్లాస్టిక్ పాపకు జన్మనిచ్చింది. ఆ పసికందును చూస్తే అచ్చం మత్స్య కన్యలా అనిపిస్తోంది.  చేపలాంటి ముఖంతో, రబ్బరు  బొమ్మలా ఉండి , చర్మం పొలుసులు తేలి ఉంది.  రాజ్ సాన్సీ గ్రామంలో పుట్టిన ఆమెను గురునానక్ దేవ్  మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు.  ప్లాస్టిక్ బేబీగా  కనిపించే ఇలాంటి పిల్లలను వైద్యపరిభాషలో 'కొల్లోడియన్ బేబీ' అంటారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన పిల్లలు ఆరు లక్షల మందిలో ఒకరు ఉంటారని గురునానక్ దేవ్  మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యుడు డా. పన్ను తెలిపారు. పాపను ఎవరైనా ముట్టుకుంటే ఏడుస్తోందని.. కనీసం తల్లిపాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉందని ఆయన చెబుతున్నారు.  జన్యు లోపాల వల్ల ఇలాంటి పిల్లలు పుడతారని, 10-15 రోజులకు చర్మం పై పగుళ్లు వచ్చి పొలుసుల్లా రాలిపోతుందని.. ఈ సమయంలో భరించలేని నొప్పి ఉంటుందన్నారు. జీవితాంతం ఈ బాధను వారు భరించాల్సిందేనని  ఆయన తెలిపారు.  చర్మం పొలుసులుగా రాలిపోయే సమయంలో  కనీసం  కనుగుడ్లను కూడా మూయలేనంత  తీవ్ర బాధను  అనుభవిస్తారన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు  పట్టి  పీడిస్తాయిని వారంటున్నారు. గతంలో  చండీగఢ్ సివిల్  ఆస్పత్రిలో  ఇదే తరహాలో పుట్టిన  ఓ పాప మూడు రోజుల తర్వాత చనిపోయిందని వైద్యులు  చెప్పారు. దీంతో ఈ బిడ్డ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ