బర్త్ డే కాదు ఆ దుర్మార్గుడికి బ్యాడ్ డే!

July 22, 2015 | 11:42 AM | 3 Views
ప్రింట్ కామెంట్
yakub_memon_hang_date_birthday_same_niharonline

ఆలస్యం అయిన చివరికి న్యాయమే గెలుస్తోంది. ఇన్నాళ్లు తప్పు చేసిన వాళ్ల విషయంలో ఉదారత ప్రదర్శించిన ప్రభుత్వాలు మరెవ్వరూ అలాంటివి చెయ్యకుండా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ ను ఉరి తీయటం. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో పోలీసులకు చిక్కి శిక్ష అనుభవిస్తున్న ఏకైక నిందితుడు మెమన్ ఒక్కడే. నాన్చుతూ వస్తున్న ఇతగాడిని ఉరిని ఈనెల 30న అమలు చెయ్యబోతున్నారు. అయితే అనుహ్యంగా ఇతగాడి పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావటం విశేషం. సో, అంతమంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఈ రాక్షసుడు పుట్టినరోజు నాడే ఉరి కొయ్యకు వేలాడుతాడన్న మాట. ఇప్పటికే ఉరికి సంబంధించిన సమాచారాన్ని మెమన్ కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు జైలు అధికారులు వివరించారు. అంతేకాదు ఉరికంబాన్ని పరిశీలించటంతో పాటు జైలు లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారట. వందల మంది ప్రాణాలు అంటే లెక్క లేనివాడికి క్షమాబిక్షలాంటివి ప్రసాదించాలని హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మరీ పేలుళ్లలో చనిపోయిన వారు మనుషులే కదా! వారి కుటుంబ సభ్యలు ఎంత రోదిస్తున్నారో... అర్థం చేసుకోవాలి కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ