పెల్లుబికిన మత ఘర్షణలతో విసిగిపోయిన తన భార్య దేశం విడిచి పోదామంటుదని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన అసహనం వ్యాఖ్యలు గుర్తున్నాయిగా. రాజకీయ నేతలతోసహా పలువురు సెలబ్రిటీలు ఈ వ్యాఖ్యల దుమారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఈ వ్యాఖ్యలు అమీర్ పై బాగా ప్రభావం చూపాయి. ఇంక్రెడిబుల్ ఇండియాతోపాటు పలు వాణిజ్య కంపెనీలు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాయి. వీటిపై గానీ, వ్యాఖ్యలపై గానీ అమీర్ ఆ తర్వాత ఎప్పుడూ నోరు మెదపలేదు.
దేశ వ్యాప్తంగా ఆయనపై ఇప్పటికీ ఆగ్రహాజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో మోదీ ఆ వేడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేకిన్ ఇండియా వీక్ వారోత్సవాల్లో భాగంగా ప్రధాని ఓ విందును ఏర్పాటుచేసి దానికి అమీర్ ఖాన్ ను ఆహ్వానించారు. పెట్టుబడుల్లో ఆకర్షణ భాగంగా ఏర్పాటుచేసిన ఈ విందులో అంతర్జాతీయ, జాతీయ వ్యాపారవేత్తలను, ప్రముఖుల్ని ఆహ్వానించారని తెలుస్తోంది. వీరితోపాటే బాలీవుడ్ నుంచి అమీర్ ను, కంగనాకు ఇన్విటేషన్ పంపారంట. విందుకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలబెట్టేందుకు వీరిద్దరిని ఆహ్వానించినట్లు సమాచారం.