ముంబైలో తొలి ‘మేకిన్ ఇండియా వీక్’ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశంలో ఉత్పత్తిరంగం అభివృద్ధి చెందడానికి ఈ సదస్సు ఉత్ప్రేరకంగా సదస్సు ప్రారంభోత్సవంలో మోదీ ప్రసంగించారు. భారత్ లో పెట్టుబడుల అవకాశాల విస్తృతిని ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి తెలియజేస్తామని పేర్కొన్నారు
బహుళజాతి సంస్థలు సహా దాదాపు 190కి పైగా కంపెనీలు, 60 దేశాలకు చెందిన 5,000 మంది పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. అలాగే రతన్ టాటా, ముకేశ్ అంబానీ వంటి వ్యాపార దిగ్గజాలు హాజరవుతారు. ఇందులో వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. అరుణ్‌జైట్లీ, రవిశంకర్‌ప్రసాద్, నిర్మలా సీతారామన్ సహా దాదాపు 13 మంది కేంద్ర మంత్రులు, 12 రాష్ట్రాల ముఖ్యమం త్రులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశముంది.