ముస్లింలలో భయాన్ని తొలగించండి

March 24, 2016 | 11:21 AM | 1 Views
ప్రింట్ కామెంట్
sufi-requested-modi-muslims-fear-niharonline

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇస్లాం ముసుగులో చేస్తున్న మారణకాండను సూఫీ మతపెద్దలు తీవ్రంగా ఖండించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ సూఫీ సదస్సుకు పెద్దఎత్తున హాజరైన ప్రతినిధులు, ఐఎస్, తాలిబాన్, అల్ ఖైదా తదితర సంస్థలు ఇస్లాంకు వ్యతిరేకమని తీర్మానించారు. ఇండియాలో ముస్లిం యువత పెడదారిన వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, పేద ముస్లింలను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.

                         "గొడవల కారణంగా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. ఈ భయాలను ప్రభుత్వం తొలగించాలి. చిన్న చిన్న మతపరమైన ఘటనలు కూడా చోటుచేసుకోకుండా చూడాలి" అని వరల్డ్ సూఫీ ఫోరమ్ డిక్లరేషన్ కోరింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఆల్ ఇండియా ఉలామా అండ్ మసాయిక్ బోర్డుకు పంపనున్నట్టు మత పెద్దలు వెల్లడించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ