టైమ్స్ జాబితాలో పేరు ఉండటం. ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల జాబితాలో ఐదో స్థానం రావటం ఇవన్నీ నరేంద్ర మోదీ ఖ్యాతికి కేవలం శాంపిల్సే. పాలనలోనే కాదు ఆలోచనా విధానంలోనూ, వ్యక్తిత్వంలోనూ కూడా ఆయన స్టైలే వేరు. అందుకే అగ్రరాజ్య అధ్యక్షుడితో సహా ప్రపంచంలోని పలు దేశాల నేతలు సైతం ఆయనతో దోస్తీకి ముందుకు వస్తున్నారు... ఆరాధిస్తున్నారు. ఇప్పుడా జాబితాలో హాలీవుడ్ నట దిగ్గజం, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ కూడా చేరారు. ఢిల్లీలో జరిగిన ఢిల్లీ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్నాల్డ్ మాట్లాడుతూ... మోదీ వ్యవహార శైలిని ఎప్పటినుంచో గమనిస్తున్నానని, ఆయన ఆలోచనా విధానాలను తాను ఎంతో ఆరాధిస్తానని అన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కాలువలపై సోలార్ పానెల్స్ ఏర్పాటుచేయటం లాంటి ప్రయత్నం అమోఘమని ఆయన అన్నారు. మోదీ పాలనలో గుజరాత్ ఇండియా కాలిఫోర్నియాలా మారిందని కితాబిచ్చాడు. దేశ ప్రధానిగా మంచి విజన్ తో మోదీ పనిచేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. త్వరలో పారిస్ లో జరగబోయే వాతావరణ సదస్సుకు రావాలని మోదీకి ఆయన ఆహ్వనం తెలిపాడు.