వస్తు దుర్వినియోగం భారత్ లో అనాదిగా వస్తున్న సంప్రదాయమేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భూతాపం కార్బన ఉద్గారాలపై సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజల జీవన విధానంలో మార్పు వస్తేనే మిగతావీ మారతాయని, ఆ మార్పు రానంతవరకు ఇతర ప్రయత్నాలన్నీ వ్రుథానేనని ఆయన అన్నారు. వస్తువుల పునర్వినియోగంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోందని అన్నారు. ప్రపంచంలోనే అతితక్కువ కార్బన ఉద్గారాలు విడుదల చేసే దేశాల్లో ఇండియా ఒకటని, పర్యావరణ పరిరక్షణ విషయంలో మన క్రుషిని ఎవరూ ప్రశ్నించలేరని మోదీ అన్నారు. సౌర, పవన విద్యుత్ విభాగంలో ప్రత్యేక చోరవ చూపిస్తామని మోదీ తెలిపారు.