ప్రధాని రూటే సపరేటూ!

April 06, 2015 | 11:47 AM | 64 Views
ప్రింట్ కామెంట్
modi_helps_to_photographer_niharonline

వేసే ప్రతి అడుగులోనూ ప్రధాని నరేంద్ర మోదీది విలక్షణ శైలే. ఈ విషయంలో ఆయనకు ఆయనేసాటి. ఏ ఒక్క రాజకీయ నేత కూడా ఈ విషయంలో ఆయన దరిదాపుల్లోకి రారంటే అతిశయోక్తి కాదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి సోషల్ మీడియాను విరివిరిగా వినియోగిస్తున్న ఆయన ప్రింట్ మీడియాపైన అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు నిన్న జరిగిన ఓ ఘటనే నిదర్శనం. ఆదివారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు కోసం విజ్ఝాన్ భవన్ కు వెళ్తున్న ఆయన భవన్ ప్రాంగణంలో ఓ చోట భద్రతా వలయాన్ని దాటుకుని మరీ ప్రింట్ మీడియాకు చేయందించారు. తనను ఫోటో తీయబోయిన ఓ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్ ఉన్నట్టుండి పట్టుతప్పి కింద పడబోయారు. వెనువెంటనే స్పందించిన మోదీ, తన చేయందించి ఆ ఫోటోగ్రాఫర్ ని పైకి లేపారు. ఈ ద్రుశ్యాన్ని ఇతర ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ