ఢిల్లీ డిక్షనరీ నుంచి ప్రధాని తొలగించిన పదం

April 11, 2016 | 04:27 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Jaitley-praises-modi-for-eradicate-corruption-in-delhi-niharonline

దేశంలో పెరిగిపోయిన అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తానని ప్రకటించిన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు సంబంధించి కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ రంగాల్లో ఇప్పటికే రహాస్య విభాగాలను ఏర్పాటు చేసి కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇంకోవైపు ప్రజల్లో కూడా చైతన్యం తెచ్చేందుకు ప్రకటనలను రూపొందిస్తూ ముందుకు సాగుతోంది.

                      ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కోల్ కతా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతి అనే పదాన్ని ఢిల్లీ డిక్షనరీ నుంచి ప్రధాని మోదీ శాశ్వతంగా తొలగించారని పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో 2జి, బొగ్గు కుంభకోణం సహా అనేక స్కామ్‌లు బయటపడిన నేపథ్యంలో ప్రస్తుత ఎన్‌డిఏ సర్కారును అవినీతి రహిత ప్రభుత్వంగా జైట్లీ పోల్చారు. మోదీ పాలనలో అవినీతికి సంబంధించిన చిన్న ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. పాలన ఎలా చేయాలో ప్రపంచం కూడా మోదీని చూసి నేర్చకుంటుందని ఈ సందర్భంగా ఆయన కితాబిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ