మన ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వరుస విదేశీ పర్యటనల భాగంగా పగలంతా సమావేశాలతో బిజీగా ఉండే ఆయన రాత్రిళ్లు ఎక్కడ బస చేస్తారు, ఏం చేస్తారు అన్నది చాలా మందికి తెలియని విషయం. ప్రధాని హోదాలో ఉన్నారు కదా! ఏకంగా కోట్లు కుమ్మరించి ఖరీదైన స్టార్ హోటళ్లోనే ఉంటారు, అనునకుంటే మాత్రం పొరపాటే. విదేశీ పర్యటనల్లో భాగంగా ఆయా దేశాల్లో బస కోసం హోటల్ గదులను ఆశ్రయించకుండా నైట్ జర్నీలతో వినూత్న రీతిలో సింగిల్ టూర్ లోనే పలు దేశాలను చుట్టేస్తున్నారు.
తాజా మూడు దేశాల పర్యటనలో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చింది. తొలుత బెల్జియం పర్యటనకు బయలుదేరిన మోదీ... అక్కడి నుంచి అమెరికాకు ఆ తర్వాత అక్కడి నుంచే సౌదీ అరేబియా వెళ్లారు. సౌదీ రాజధాని రియాద్ నుంచి ఆయన తిరిగి భారత్ చేరుకున్నారు. అంటే పర్యటనలో మూడు రాత్రుళ్లు ఆయన విమానంలోనే గడిపారన్న మాట. రాత్రి ప్రయాణాలతో అటు టైం సేవ్ కావడమే కాక ఇటు బస కోసం హోటల్ గదులు మోదీకి అక్కర్లేకుండా పోయాయి. భవిష్యత్తు విదేశీ పర్యటనలను కూడా ఇదే తరహాలో కొనసాగించాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా సమయంతోపాటు, కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకుండా ఆయన చూసుకుంటున్నారు.