గాంధీ గిరి: నా నీళ్లు తాగి నన్నే తిట్టు

December 16, 2015 | 04:01 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_offer_glass_water_AAP_MP_bagawanth_Maan_niharonline

పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్ సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి అవినీతి భాగోతంపై దర్యాప్తు పేరిట సీబీఐ అధికారులు ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోనే నిన్న సోదాలు చేశారు. దీనిపై మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన కార్యాలయంలో సీబీఐ సోదాలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆప్ ఎంపీ భగవంత్ మన్ లోక్ సభలో నిరసన గళం విప్పారు. సీబీఐ అధికారుల తీరుకు నిరసనగా ఆయన పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వచ్చేశారు.

ఈ క్రమంలో గొంతు తడారిపోయిన మన్ మంచి నీళ్ల కోసం దిక్కులు చూశారు. చివరకు పోడియం వద్ద కూర్చున్న లోక్ సభ సెక్రటేరియట్ సిబ్బంది టేబుళ్లపై ఉన్న గ్లాసును అందుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ సమయంలో ఆయన వైపు చిరు దరహాసంతో చూసిన ప్రధాని నరేంద్ర మోదీ తన టేబుల్ పై ఉన్న మంచినీళ్ల గ్లాసును అందించారు. అప్పటికే దాహంతో అల్లాడిపోయిన మన్, మోదీ అందించిన గ్లాసులోని నీటిని గటగటా తాగేశారు. ఆ తర్వాత మోదీకి మన్ చిరునవ్వుతోనే కృతజ్ఞత చెప్పారు. తనను విమర్శిస్తున్న సభ్యుడికి కూడా మంచినీళ్లందించి మోదీ సాయమందించిన తీరును బలపరుస్తూ బీజేపీ సభ్యులు గట్టిగా బల్లలు చరిచి హర్షం వెలిబుచ్చారు. ఆ తర్వాత కూడా మన్ తన నిరసనను కొనసాగించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ