పార్లమెంట్ కొత్త సమస్యలకు కారణం కావొద్దు

November 26, 2015 | 11:54 AM | 3 Views
ప్రింట్ కామెంట్
PM_narendra_modi_about_parliament_before_winter_session_niharonline

పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి తనదైన శైలిలో మాట్లాడి మీడియాను ఆకట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షల మేరకు రచించబడిన ఆశాకిరణం అని, అసలు Ray of 'HOPE' అనే పదంలోనే ఎంతో అర్థం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. హెచ్ అంటే హార్మొనీ (సామరస్యం), ఓ అంటే ఆపర్చ్యునిటీ (అవకాశం), పీ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ (ప్రజల భాగస్వామ్యం), ఈ అంటే ఈక్వాలిటీ (సమానత్వం) అని వెల్లడించిన మోదీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో అద్భుత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారని కొనియాడారు.

ఏ సమస్యనైనా, ఓపికతో చర్చించి పరిష్కరించుకునే అవకాశం మనకుందని, పార్లమెంటు చర్చావేదికగా మారాలే తప్ప కొత్త సమస్యలను సృష్టించరాదని హితవు పలికారు. ప్రజలు ఎన్నో ఆశలతో తమ ప్రతినిధులను ఎన్నుకుని పార్లమెంటుకు పంపితే, అనవసర రభసలతో విలువైన సమయాన్ని వృథా చేయవద్దని విపక్షాలకు మోదీ సూచించారు. ఈ శీతాకాల సమావేశాల్లో అన్ని పార్టీలూ ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం వెతికే దిశగా పని చేయాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ