సింగపూర్ లో మోదీ సమగ్ర సమాచారం

November 25, 2015 | 11:54 AM | 2 Views
ప్రింట్ కామెంట్
pm-modi-met-president-singapore-tony-tan-keng-yam-key-agreements-niharonline

సింగపూర్‌లో మోదీ పర్యటన పూర్యయ్యింది. భారత్ సింగపూర్ మధ్య పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. రక్షణ, వాణిజ్యపరంగా సహాయ సహకారాలు అందించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రధాని నరేంద్రమోదీ, సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ సంతకాలు చేశారు. సింగపూర్ పర్యటనలో రెండోరోజైన మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. తన అధికార భవనమైన ఇస్తానాలో మోదీకి ఘన స్వాగతం పలికారు.

అనంతరం వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇద్దరు ప్రధానులు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్, సింగపూర్ ద్వైపాక్షిక చర్చలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. భద్రత తదితర అంశాల్లో బలమైన సహకారం అందించుకోవాలి. ప్రాంతీయ సుస్థిరత, అభివృద్ధికి ఇరు దేశాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి అని సంయుక్త ప్రకటనలో ఇరు ప్రధానులు పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇలా ఉన్నాయి, సింగపూర్‌లోని ఆసియాన్ సివిలైజేషన్స్ మ్యూజియానికి రుణ పొడిగింపు, రక్షణ సహకారానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్, ఇండియన్ ఐటీ డిపార్ట్‌మెంట్ అండ్ సింగపూర్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సింగపూర్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ మధ్య ఎంవోయూ కుదిరింది. జైపూర్, అహ్మదాబాద్ విమానాశ్రయాల అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇండియాకు సింగపూర్ కో ఆపరేషన్ ఎంటర్‌ప్రైజెస్ మధ్య కూడా ఎంఓయూ కుదిరింది. నీతిఆయోగ్‌తో సింగపూర్ కో ఆపరేషన్ ఎంటర్‌ప్రైజెస్ మధ్య మరో ఒప్పందం, పట్టణ ప్రణాళిక, మురుగునీటి- ఘనవ్యర్థాల నిర్వహణ తదితరాలపై ఒప్పందాలు కుదిరాయి.

                        ఇక టూర్ లో సింగపూర్ ప్రధాని హెచ్‌ ఈ లీ సీన్ లూంగ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన కానుకను ఇచ్చారు. 1849 నాటి సింగపూర్ దీవుల మ్యాప్‌ పునర్‌ముద్రణను కానుకగా ఇచ్చారు. భారత జాతీయ ఆర్కైవ్స్ సంస్థ నుంచి సేకరించిన రేఖాచిత్రాల ఆధారంగా ఆనాటి మ్యాపును మళ్లీ యాథాతథంగా పునర్‌ముద్రించి లీ సీన్ లూంగ్‌కు అందజేశారు. 1842-45 మధ్యకాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా దీనిని రూపొందించారు. అప్పటి సింగపూర్ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, దిగువప్రాంత జలాలను ఇందులో చూపించడం జరిగింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ