శ్రీలంక చేరుకున్న ప్రధాని మోదీ

March 13, 2015 | 11:05 AM | 54 Views
ప్రింట్ కామెంట్
PM_Modi_reaches_srilanka_niharonline

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన చివరి దశకు చేరుకుంది. విదేశీ పర్యటనలో భాగంగా ఈ ఉదయం ఆయన మారిషస్ నుంచి శ్రీలంకకు చేరుకున్నారు. ఈ సందర్భంగా లంక ప్రధాని రనిల్ విక్రమసింగే, విదేశీ వ్యవహారాల ప్రతినిధి సయిద్ అక్బరుద్దీన్ లు మోదీకి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. భారత్-శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తో చర్చలు జరుపుతారు. కాగా మోదీ పర్యటన నేపథ్యంలో 86 మంది భారత జాలర్లను విడుదల చేయాలని సిరిసేన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత లంకలో ఓ భారత ప్రధాని పర్యటించటం ఇదే తొలిసారి. తమ నీటి పరిధిలోకి ప్రవేశిస్తే భారత జాలర్లను కాల్చి పారేస్తామని లంక ప్రధాని వ్యాఖ్యానించిన నేపథ్యంలో చర్చలు ఎలా జరుగుతాయోనని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తితో చూస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ