ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. మారిషస్, సీషెల్స్, శ్రీలంకలో ఆయన పర్యటించి తిరిగి 14న భారత్ కు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా సముద్ర జలాల్లో పరస్పర సహకారం దిశగా తాను పర్యటించే దేశాలను ఒప్పించే విషయంపై మోదీ ద్రుష్టిసారించనున్నారు. శ్రీలంక తీరంలో సేదతీరుతున్న చైనా ఓడల పట్ల భారత్ ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల శ్రీలంక ప్రధాని భారతీయ మత్స్యకారులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ అంశమే ప్రధానంగా చర్చలు ఉండబోతున్నట్లు విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ తెలిపారు. ఇరుదేశాల మైత్రి ని తిరిగి బలపడే దిశగా చర్చలు ఉండనున్నట్లు చెప్పారు. ఇక శ్రీలంక నుంచి బయలుదేరి సీషెల్స్ వెళ్తారు. ఇందిరాగాంధీ తర్వాత సీషెల్స్ లో పర్యటించే భారత ప్రధాని మోదీ కావటం విశేషం. ఇక అక్కడి నుంచి మారిషస్ కు చేరుకుని అక్కడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.