నెహ్రూ తర్వాత ఆ ఘనత మోదీదే!

December 22, 2015 | 11:42 AM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-jacket-nehru-niharonline

భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ ఎంతలా ఉందో నిరూపించే మరో ఉదాహరణ. ఆయన స్పీచ్ లకే కాదు, స్టైల్ కు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. సాక్షాత్తు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రా పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ధరించిన కోటుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు వుంది. నలుపు, నీలం రంగుల్లోనే కాక మరిన్ని లైట్ కలర్లలో కనిపించే ఆ కోట్లు గులాబీ పువ్వుతో మెరిసిపోయేవి. ఫుల్ హ్యండ్స్ తో ఉండే సదరు కోటుకు ‘జవహర్ జాకెట్’గా పేరు పడిపోయింది. ఇక నెహ్రూ తర్వాత ఆ స్థాయిలో వస్త్రధారణలో పాపులర్ అయిన భారత ప్రధాని దాదాపుగా ఎవ్వరూ లేరనే చెప్పాలి. ఇన్నేళ్లకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కోటుకు మళ్లీ పాపులారిటీ పెరిగింది. చేతుల్లేకుండా స్లీవ్ లెస్ గా కనిపించే మోదీ కోటుకు దేశంలోనే కాక విదేశాల్లోనూ ప్రాచుర్యం పెరుగుతోంది.

                                 ‘మోదీ జాకెట్’ గా ప్రాచుర్యం పొందుతున్న ఈ కోటు వేసుకునేందుకు భారత్ లోనే కాక, పలు దేశాలకు చెందిన నేతలు కూడా ఆసక్తి చూపుతున్నారని నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మిశ్రా పేర్కొన్నారు. జపాన్ ప్రధాని షింజో అబే ఏకంగా మోదీ జాకెట్ ను ధరించారని కూడా ఆయన చెప్పారు. మోదీ జాకెట్ కు పెరుగుతున్న పాప్యులారిటీని దృష్టిలో పెట్టుకుని ఖాదీ వినియోగాన్ని మరింత పెంచేలా చర్యలు చేపడుతున్నామని మిశ్రా ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ