మోదీ కన్నా ఒబామా ఓ మెట్టు తక్కువే!

January 19, 2016 | 11:32 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi-FB-fans-five-times-more-interactive-than-Obama-niharonline

సోషల్ మీడియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ‘ఫేస్ బుక్’లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో రెండో వ్యక్తిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉండగా, రెండో స్థానంలో మోదీ నిలిచారు. 4.6 కోట్ల మంది ఫాలోయర్లతో ఒబామా అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానం మోదీదేనని ‘పీఆర్ ఫర్మ్ బర్సన్- మార్స్ టెల్లర్’ అధ్యయనం తేల్చేసింది.

                 ‘ఫేస్ బుక్’లో మోదీ పేరిట రెండు ఖాతాలున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరిట, రెండోది ‘పీఎంఓ ఇండియా’ పేరిట ఉన్నాయి. వీటిలో ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరిట ఉన్న ఖాతాను విశ్వవ్యాప్తంగా 3.1 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక ‘పీఎంఓ ఇండియా’ ఖాతాను 1.1 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక మరో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే ఫేస్ బుక్ ‘లైక్స్’, ‘కామెంట్స్’, ‘షేర్స్’ తరహా ఇంటరాక్షన్లలో మోదీ, ఒబామాను వెనక్కు నెట్టేశారు. గతేడాదిలో మోదీ పేజీకి 20 కోట్ల ఇంటరాక్షన్లు వెల్లువెత్తగా, ఒబామా పేజీకి కేవలం 4 కోట్ల ఇంటరాక్షన్లు కూడా రాలేదట. ఫాలోయింగ్ ఎక్కువున్న ఒబామా మాత్రం మోదీ కన్నా ఓ మెట్టు కిందే ఉన్నారన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ