సార్వభౌమ బంగారు బాండ్లకు సమయమిదే

January 18, 2016 | 02:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
sovereign-gold-bond-Scheme-niharonline

నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన గోల్డ్ బాండ్ స్కీం విజయవంతంగా దూసుకుపోతుంది. బంగారం కొనుగోలు కోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం, విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం, ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం ఈ పథక లక్ష్యం.  

                      గత నెలలో మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం గత నెల ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్ స్కీంకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తొలిదశలో ఇప్పటి వరకు 63,000 దరఖాస్తులు ప్రజల నుంచి రాగా, సుమారుగా 250 కోట్ల రూపాయల విలువైన బంగారానికి సరిపడా బాండ్లను ప్రభుత్వం విక్రయించింది. ఇది 917 కిలోల బంగారానికి సమానం.

ఇక అదే ఊపుతో ఇప్పుడు రెండో విడతను ప్రారంభించింది. జనవరి 18 నుంచి 22 దాకా ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. సార్వభౌమ బంగారు బాండ్ల విషయానికొస్తే.. కనీసం 2 గ్రాముల విలువ చేసే బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి 500 గ్రాములు. బ్యాంక్ శాఖలు, ఎంపిక చేసిన తపాలా శాఖ కార్యాలయాల, స్టాక్ హోల్డిండ్ కార్పోరేషన్ల ద్వారా ఈ బాండ్లను విక్రయించనున్నారు. బాండ్ కాలపరిమితి 8 ఏండ్లు. బాండ్ల కొనుగోలు తర్వాత ఐదేండ్లు పూర్తయ్యాక అవసరమైతే పెట్టుబడిని ఉపసంహరించుకునే వీలుంటుంది. ఈ బాండ్లపై 2.75 శాతం వార్షిక వడ్డీ లభించనుంది. ఈసారి జారీకి ఒక్కో గ్రాము ధరను రూ.2,600గా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

                       ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై  ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్‌బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు.  గరిష్టంగా 500  గ్రాముల వరకు బాండ్లు రూపంలో తీసుకోవచ్చు. ఏడాది నుండి మూడు సంవత్సరాల స్వల్ప కాలానికి, ఐదు నుండి యేడేళ్ల మధ్య కాలానికి, 12 నుండి పదిహేనేండ్లు దీర్ఘకాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల లానే దీనికి కూడా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.  మిడ్ టర్మ్ స్కీంలో 2.25 శాతం వడ్డీని.. లాంగ్ టర్మ్ కు 2.5 శాతం వడ్డీ ని చెల్లిస్తారు.. షార్ట్ టర్మ్ పై వడ్డీ ఎంత చెల్లించాలనే దాన్ని బ్యాంకుల నిర్నయానికే వదిలేశారు. గడువు కంటే ముందే పసిడిని వెనక్కి తీసుకుంటే కొంత మొత్తంలో పెనాల్టీ వసూలు చేసి బంగారాన్ని తిరిగిస్తారు. చూసారుగా.. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న మార్గాలు.

మరిన్ని వివరాలకు మా ఈ-కామర్స్ పోర్టల్ గోల్డ్-ఎన్-సిల్వర్.ఇన్ ను సంప్రదించగలరు. లేదా https://www.goldnsilver.in/goldbonds  లింక్ ను క్లిక్ చేయండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ