మోదీ-షరీఫ్ చర్చ యుద్ధం గురించా?

December 29, 2015 | 12:01 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Modi_Nawaz_pep_talk_wars_India_Pak_niharonline

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ హడావుడి పర్యటన ఓ సంచలనం. రష్యా, అప్ఘనిస్థాన్ పర్యటన ముగించుకుని తిరుగు పయనమవడానికి కొద్ది గంటల ముందు ఖరారైన లాహోర్ పర్యటనపై విశ్వవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. ఈ పర్యటనపై పలు ఆసక్తికర కథనాలు కూడా వెలువడుతున్నాయి. రెండు గంటల పాటు లాహోర్ శివారులోని నవాజ్ ఇంటిలో గడిపారు మోదీ. హగ్గ్ అండ్ టీ అని వ్యాసాలు వచ్చాయే తప్ప అక్కడేం మాట్లాడుకున్నారన్నది తెలీలేదు. అయితే తాజాగా నవాజ్ షరీఫ్ తో మోదీ అన్న మాటలను ఊటంకిస్తూ  ఓ ప్రముఖ పత్రిక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది.

                                      నవాజ్ తో పాటు ఆయన సోదరుడు, ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్ర సీఎం షాబాద్ షరీఫ్ లతో మాట్లాడిన సందర్భంగా మోదీ యుద్ధాన్ని ప్రస్తావించారు. ‘‘యుద్ధం వల్ల ఏం వస్తుంది? భూమి రాదు, స్వర్గం కూడా రాదు’’ అని మోదీ అన్నారంట. ఈ వ్యాఖ్యలతో అంగీకరించిన షరీఫ్ బ్రదర్స్ ‘‘వెల్ సెడ్’’ అంటూ చాలా బాగా చెప్పారని మోదీని కీర్తించారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ