మోదీ చివరి మన్ కీ బాత్ సారాంశం

December 28, 2015 | 12:07 PM | 2 Views
ప్రింట్ కామెంట్
PM_narendra_modi_last_mann_ki_baat_2015_niharonline

దేశ ప్రజలందిరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లడించిన మోదీ  తన మనసులోని మాటలను పంచేసుకున్నారు. ఈ ఏడాది చివరిదైన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపిన ఆయన, అందుకు ఉత్సాహవంతులైన యువతే కారణమని కొనియాడారు. మారుమూల ప్రాంతాలకు విద్యుత్ అందుతోందని తెలిసి తనకెంతో సంతోషం కలుగుతోందని, దేశంలోని అన్ని ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచమంతా భాగస్వామ్యం కావడం భారత్ కు గర్వకారణమని అన్నారు.

"పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను. అలా చేస్తే, విదేశాల్లో మన ప్రతిష్ఠ మరింతగా పెరుగుతుంది. స్వచ్ఛ భారత్ ను ప్రోత్సహించడంలో మొత్తం మీడియా పలు కథనాలు ప్రచురిస్తుండటం అభినందనీయం. 'స్టార్టప్ ఇండియా'తో ఎన్ఐటీలు, ఐఐటీలు, ఐఐఎం తదితరాల మధ్య అనుసంధానం పెరిగింది. ఈ కార్యక్రమం వల్ల యువత అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోనుంది. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నాటికి మహా పురుషుల విగ్రహాలు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవం జరుపుకుందాం. ఛత్తీస్ గఢ్ కేంద్రంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించాము" అని ప్రధాని వివరించారు. జాతీయ నగదు బదిలీ పథకానికి గిన్నిస్ రికార్డు లభించిందని గుర్తు చేసిన ఆయన, ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ