పనామా జాబితాపై కన్నేసిన మోదీ

April 05, 2016 | 12:21 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-order-probe-on-panama-list-niharonline

రిజర్వ్ భ్యాంక్ కళ్లు కప్పి పన్ను ఎగవేతతోపాటు, విదేశాల్లో నల్లధనం దాచుకున్న 500 మంది భారతీయులపై కొరడా ఝుళిపించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులతో కూడిన బృందాన్ని నియమిస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించాడు. పనామా పేపర్స్ పేరుతో బయటపడ్డ సంపన్నుల అక్రమ లావాదేవీలను వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

పలు దేశాల నేతలతో పాటు అనేక మంది సెలబ్రిటీలు పనామాలో అక్రమ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కుంభకోణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్, నవాజ్ షరీఫ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్లు ఉన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో వ్యాపారవేత్తలతోపాటు, మాజీ క్రికెటర్ల పేర్లను కూడా వెల్లడించింది.  అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టులు వెల్లడించిన రహస్య విషయాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. నల్లధనం వెతికి తీతలో చిత్తశుద్ధిని ఈ రకంగా అయినా చూపాలని ఈ సందర్భంగా మోదీ అధికారులకు సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ