అతలాకుతలంపై ఆరాతీస్తున్న ప్రధాని

December 02, 2015 | 10:27 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Modi_to_jaya_assures_all_help_on_worst_rain_cripples_chennai

అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో వర్ష భీభత్సం కొనసాగుతోంది. కేవలం రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు రాజధాని చెన్నై సహా పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఫలితంగా తమిళనాడు మరో సముద్రాన్ని తలపిస్తుంది. నగరంలోని మెజారిటీ కాలనీలు నీట మునగగా, నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితులపై ఆరాతీశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడంతో పాటు అండగా ఉంటామని ఆయన జయలలితకు భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన జయలలితకు సూచించారు.

భారీ వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు కాగా, ఏకంగా చెన్నై ఎయిర్ పోర్ట్ మూతపడింది. రన్ వే పూర్తిగా నీట మునిగింది. నిన్న రాత్రికే 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భవనాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సర్వీసులు పునరుద్ధరణ ఎప్పుటివరకు అవుతాయో, చెన్నై కోలుకోవటానికి ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ